ఇదే నిజం, వేమనపల్లి : ‘తవ్వారు వదిలేశారు’…అనే శీర్షికన ‘ఇదే నిజం’ పత్రికలో ఈరోజు (మే 19) వచ్చిన కథనానికి గ్రామపంచాయతీ సిబ్బంది స్పందించారు. ముల్కలపేట గ్రామంలో ప్రధాన రహదారిపై ఇటీవల మిషన్ భగీరథ పైప్‌లైన్‌కు లీకేజీ కావడంతో తవ్వి మరమ్మతులు చేసారు. పది రోజులు గడుస్తున్నా తవ్విన గుంతను పూడ్చకుండా వదిలేయడంతో పాటు మట్టిని రోడ్డుపైనే వదిలేశారు. నిత్యం వందల సంఖ్యలో ఈ రోడ్డు మార్గాన వాహనాలు తిరుగుతుంటాయి . దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది పడుతున్నామని వాహనదారులు తెలిపారు. ఈ విషయాన్ని ‘ఇదే నిజం’వార్త రూపంలో ప్రచురించింది. స్పందించిన గ్రామపంచాయతీ సిబ్బంది ట్రాక్టర్ తో తవ్విన గుంతను పూడ్చారు. ప్రజా సమస్యలను అధికారులకు, ప్రజాప్రతినిధులకు నిత్యం తెలుపుతూ వాటి పరిష్కారం దిశగా వార్తా కథనాలు అందిస్తున్న ఇదే నిజం పత్రికకు గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.