తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన హనుమాన్ మూవీ ఘానా విజయం సాధించింది. కేవలం ఈ సినిమాని రూ.40 కోట్ల బడ్జెట్ తో రూపొందిన హనుమాన్ సినిమా రూ.350 కోట్ల వరకు వసూలు చేసింది. అయితే ఈ సినిమా క్లైమాక్స్‌లో ఇచ్చిన ఎండింగ్‍తో సీక్వెల్‍పై కూడా ఆసక్తి పెరిగిపోయింది.ఈ సినిమాకి సీక్వెల్ గా ‘జై హనుమాన్’ మూవీ రాబోతుంది. అయితే ‘జై హనుమాన్’ సినిమాలో లో హనుమంతుడి పాత్రలో ఎవరు నటిస్తారనే దానిపై చాలా కాలంగా సస్పెన్స్ కొనసాగుతోంది. హనుమంతుడి పాత్రలో కన్నడ స్టార్ రిషబ్ శెట్టి నటించబోతున్నాడు తెలుస్తుంది. దీపావళి రోజున అక్టోబర్ 30 ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నారు చిత్రబృందం. ఈ ఫస్ట్ లుక్ తో హనుమంతుడి పాత్రలో ఎవరు నటిస్తారనేది రివీల్ చేసే అవకాశం ఉంది. దీంతో ఈ ఫస్ట్ లుక్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.