Homeతెలంగాణకూతురిని మంటల్లోకి విసిరేసిన తండ్రి

కూతురిని మంటల్లోకి విసిరేసిన తండ్రి

– గడ్డివాము విషయంలో పక్కింటి వ్యక్తితో గొడవ
– మద్యం మత్తులో కుమార్తెను మంటల్లోకి తోసిన వైనం
– కామారెడ్డి జిల్లాలో ఘటన

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో : ఓ వ్యక్తి తన ఏడేళ్ల కుమార్తెను కాలుతున్న గడ్డివాములో విసిరేశాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో బీర్కూర్‌ మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం బరంగెడ్గి గ్రామానికి చెందిన దేశాయిపేట్‌ సాయిలుకు ఇద్దరు కుమార్తెలు. ఆదివారం పాఠశాలకు సెలవుకావడంతో చిన్నారులిద్దరూ ఇంటి పక్కనే ఆడుకుంటున్నారు. అదే సమయంలో వీరి ఇంటి పక్కనే ఉన్న గొట్టల గంగాధర్‌కు చెందిన గడ్డివాముకు నిప్పంటుకుని దగ్ధమైంది. దీంతో సదరు వ్యక్తి ‘మీ కుమార్తె అంకిత మా గడ్డివాముకు నిప్పటించింది’అంటూ సాయిలుతో గొడవపడ్డాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న సాయిలు కోపంతో ఊగిపోతూ తన కుమార్తె అంకితను కాలుతున్న గడ్డి వాములోకి విసిరేశాడు. అప్రమత్తమైన గంగాధర్‌ వెంటనే గడ్డివాములోకి దూకి పాపను రక్షించాడు. ఈ ఘటనలో బాలిక రెండు కాళ్లు, చెయ్యి కాలడంతో వెంటనే బాన్సువాడ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Recent

- Advertisment -spot_img