Homeక్రైంపశు సంవర్ధకశాఖ కార్యాలయంలో దస్త్రాలు మాయం

పశు సంవర్ధకశాఖ కార్యాలయంలో దస్త్రాలు మాయం

– కిటిక్ గ్రిల్స్ తొలగించి చోరీ

– సీసీ కెమెరాలు ధ్వంసం

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: పశు సంవర్థకశాఖలో కీలక దస్త్రాలు మాయం కావడం కలకలం రేపుతోంది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ఓఎస్డీ కల్యాణ్‌ ఆఫీసులో దస్త్రాలు మాయమైనట్టు అధికారులు గుర్తించారు. కార్యాలయం కిటికీ గ్రిల్స్‌ తొలగించి దస్త్రాలు చోరీ చేశారు. ముఖ్యమైన దస్త్రాలు ఎత్తుకెళ్లినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై సెంట్రల్‌ జోన్‌ డీసీపీ శ్రీనివాస్‌కు పశుసంవర్థకశాఖ అధికారులు ఫిర్యాదు చేశారు. దస్త్రాలు మాయంపై ఆశాఖ డైరెక్టర్‌ను డీసీపీ ప్రశ్నించారు. దస్త్రాల అదృశ్యంపై తమకు ఎటువంటి సమాచారం లేదని డైరెక్టర్‌ తెలిపినట్టు సమాచారం. ‘‘కొన్ని ఫైల్స్ కావాలనే చింపినట్లు గుర్తించాం. సీసీ కెమెరాలు కూడా ధ్వంసం చేశారు. ఓఎస్డీ కల్యాణ్‌, ఎలిజ, మోహన్‌, వెంకటేశ్‌, ప్రశాంత్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం’’ అని సెంట్రల్‌ జోన్‌ డీసీపీ శ్రీనివాస్‌ తెలిపారు. పశుసంవర్థకశాఖ కార్యాలయంలో ఫైల్స్‌ మాయమైనట్టు వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారమని మాజీ ఓఎస్డీ కల్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు. మంత్రి ఆమోదం కోసం వచ్చిన ఫైల్స్‌ను నిర్దిష్టమైన విధానంతలో ఎప్పటికప్పుడు పశుసంవర్థకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కార్యాలయంలో అందజేసినట్టు వివరించారు. ప్రభుత్వ మార్పిడి, ఫర్నిచర్‌, ఇతర సామగ్రి జీఏడీకి అప్పగించే ప్రక్రియలో భాగంగానే మాసబ్‌ట్యాంక్‌ కార్యాలయానికి వెళ్లినట్టు పేర్కొన్నారు. ఫైల్స్‌ మాయమైనట్టు అసత్య ప్రచారం జరుగుతోందని, ఈవిషయంలో ఎలాంటి విచారణకైనా సిద్ధమని కల్యాణ్‌ తెలిపారు.బషీర్‌బాగ్‌లోని ఆర్జేడీ బిల్డింగ్‌లో ఉన్న విద్యాశాఖ మంత్రి కార్యాలయంలోని ఫర్నిచర్‌ను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లేందుకు యత్నించారు.

Recent

- Advertisment -spot_img