HomeసినిమాThe first look of 'KH 2'34' is exciting అదిరిపోయిన ‘కేహెచ్ 2​34’ ఫస్ట్...

The first look of ‘KH 2’34’ is exciting అదిరిపోయిన ‘కేహెచ్ 2​34’ ఫస్ట్ లుక్

లోక నాయకుడు కమల్ హాసన్​, లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కాంబోలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. 1987లో వచ్చిన ‘నాయగన్’మూవీ తర్వాత 36 ఏండ్లకు వీరిద్దరు కలిసి చేస్తున్న సినిమా ఇది. కమల్​ కెరీర్​లో 234వ మూవీ కావడంతో.. వర్కింగ్​ టైటల్​ను ‘కేహెచ్ 234’గా మేకర్స్ ఫిక్స్ చేశారు. అయితే, నేడు కమల్​ బర్త్ డే సందర్భంగా ఈ మూవీకి సంబంధించి ఆయన ఫస్ట్​లుక్​ను మేకర్స్ రిలీజ్ చేశారు. మొహానికి ముసుగుతో కమల్ డిఫరెంట్​గా కనిపిస్తున్నారు. ఈ మూవీలో హీరోయిన్​గా త్రిష నటిస్తుండగా.. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్, మద్రాస్ టాకీస్ బ్యానర్లపై కమల్ హాసన్, మణిరత్నం, ఆర్ మహేంద్రన్, శివ అనంతి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img