Homeహైదరాబాద్latest Newsతొలి సంతకం డీఎస్సీపైనే.. అభ్యర్థుల ఆశలన్నీ 12వ తేదీ పైనే..!

తొలి సంతకం డీఎస్సీపైనే.. అభ్యర్థుల ఆశలన్నీ 12వ తేదీ పైనే..!

ఏపీ ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయం సాధించడంతో డీఎస్సీ అభ్యర్థుల ఆశలు చిగురిస్తున్నాయి. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ ప్రకటనపైనే తొలి సంతకం చేస్తానని ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వడమే ఇందుకు కారణం. ఈనెల 12న సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలి సంతకం డీఎస్పీపైనే ఉంటుందనే ఆశతో ఉన్నారు. అయితే కూటమి అధికారంలోకి రాగానే తొలి సంతకం డీఎస్సీపైనే చేస్తానని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అయితే బాబు చెప్పినట్లు బుధవారం ప్రమాణ స్వీకారం అనంతరం తొలి సంతకం ఆ ఫైలుపై పెట్టనున్నారు. టీడీపీ వచ్చాక ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

Recent

- Advertisment -spot_img