Homeహైదరాబాద్latest Newsఈటల గేమ్ స్టార్ట్.. అధ్యక్ష పదవి కోసం సరికొత్త డ్రామా..!

ఈటల గేమ్ స్టార్ట్.. అధ్యక్ష పదవి కోసం సరికొత్త డ్రామా..!

  • అధ్యక్ష పదవి కోసం కొత్త నాటకం
  • అనుకూల పత్రికల్లో కథనాల డ్రామా..!
  • రేవంత్.. ఈటలను పిలుస్తున్నాడంటూ వార్తలు
  • సోషల్ మీడియా.. డిజిటల్ మీడియాలో స్టోరీల వండకం
  • బీజేపీ హైకమాండ్ వద్ద ఎమోషనల్ గేమ్

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: మీడియాను మేనేజ్ చేయడంలో ఈటలను మించిన లీడర్ ఉండరేమో.. తనకంటూ ప్రత్యేక టీమ్.. సందర్భోచితంగా ప్రత్యేక కథనాలు, వార్తలు వండివార్చడంలో వారు దిట్టలు. నిత్యం మీడియాలో ఉండేలా పకడ్బందీ ప్లాన్. బీజేపీలో తానే పెద్ద లీడర్ అని నిరూపించేలా నిత్యం వార్తలు, కథనాలు. ఇక ఈటల తన గొంతెమ్మ కోరికలు నెరవేర్చుకోవాలన్నా మీడియానే ఆశ్రయిస్తుంటారు. ఢిల్లీ స్థాయిలో లాబియింగ్ చేయడం ఓ ఎత్తైతే.. స్వరాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారిపోతున్నారంటూ మీడియాలో కథనాలు రాయించుకోవడం మరో పద్ధతి. తాజాగా అదే ఫార్ములాను సిద్ధం చేసి.. ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తున్నాడు ఈటల.

ఈటలను రేవంత్ రారమ్మంటున్నారా.. !
ఈటల రాజేందర్ ను ముఖ్యమంత్రి రేవంత్ రా రామ్మంటూ ఆహ్వానిస్తున్నారట. ఈటల లాంటి అతిపెద్ద బీసీ లీడర్ ను తమ పార్టీవైపుకు తిప్పుకుంటే కాంగ్రెస్ పార్టీకి బీసీ సమాజం నుంచి తిరుగులేని సపోర్ట్ దక్కుతుందట. ఇక తెలంగాణలో బీజేపీని దెబ్బ తీయాలంటే ఈటలను టార్గెట్ చేస్తే ఆ పార్టీ దెబ్బకు కుప్పకూలిపోతుందట. ఇవి ఇటీవల ఈటల రాజేందర్ ను ఉద్దేశించి ఆయనకు అనుకూలమైన డిజిటల్ పత్రికలు, సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్, యూట్యూబ్ చానళ్లలో పుంఖానుపుంఖాలుగా వచ్చిన వార్తలు. అయితే అ సందర్భంగా ప్రస్తుత పరిస్థితుల్లో ఇటువంటి కథనాలు ఎందుకు వచ్చాయని అంతా ఆశ్చర్యపోతున్నారు. నిజానికి ఈ కథనాల వెనక ఈటల రాజేందర్ అతి పెద్ద మైండ్ గేమ్ ఉందని తెలుస్తోంది. ‘కొట్టడు, తిట్టడు నరాలు మెలేస్తడు’ ఇది ఈటల మీద పొలిటికల్ సర్కిళ్లలో ఉన్న అభిప్రాయం. తాజాగా ఈ సామెతను నిజం చేస్తున్నాడు ఈటల. ఇదంతా అధ్యక్ష పదవి కోసమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Recent

- Advertisment -spot_img