Homeజిల్లా వార్తలుబైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా గుట్టురట్టు.. 5 గురు సభ్యుల ముఠా అరెస్ట్, 16 బైకులు...

బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా గుట్టురట్టు.. 5 గురు సభ్యుల ముఠా అరెస్ట్, 16 బైకులు స్వాధీనం..

ఇదే నిజం,శేరిలింగంపల్లి: బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాగుట్టు ను గచ్చిబౌలి పోలీసులు రట్టు చేశారు. స్పెషల్ డ్రైవ్ లో భాగంగా నిర్వహించిన వాహనాల తనిఖీల్లో ఐదుగురు సభ్యుల ముఠా పట్టుబడింది. ముఠాలో దేవ కిషోర్, వీర వెంకట సత్యనారాయణ, దిలీప్ లతో పాటు ఇద్దరు మైనర్లు పట్టుబడ్డారు. నిందితుల దగ్గర నుండి 16 బైకులు స్వాధీనం చేసుకున్నారు.
నిందితులు గతంలో స్విగ్గి డెలివరీ బాయ్స్ గా పని చేస్తుండేవారు. జల్సాలకు అలవాటు పడి ఈ క్రమంలో బైకు దొంగలుగా మారారు.. నిర్మానుష్య ప్రాంతాలు సిసి కెమెరాలు లేని ప్రాంతాలను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారు. ప్రధానంగా ఎక్కువగా ఖరీదైన బైక్స్ నే టార్గెట్ చేస్తూనే హాస్టల్స్, అపార్ట్మెంట్స్ లో చోరీలు చేస్తున్నారు. ప్రధాన సూత్రధారి దేవకిషర్ సహాయంతో డూప్లికేట్ మాస్టర్ కీస్ తయారీ చేస్తూ బైక్ లు దొంగిలిస్తున్నారు. కొండాపూర్ రాఘవేంద్ర కాలనీలోని ఓ అపార్ట్మెంట్ సెల్లార్లో దొంగిలించిన వాహనాలు దాచి ఉంచారు. దొంగిలించిన వాహనాలను ఆంధ్రాలో అమ్మకానికి పెడుతున్నారు. గచ్చిబౌలి పోలీసులు తనిఖీల్లో భాగంగా ఈ ముఠాను అరెస్టు చేశారు. అందులో ముగ్గురిని రిమాండ్ కు పంపించి మరో ఇద్దరికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు.

Recent

- Advertisment -spot_img