రష్యాలో నలుగురు భారతీయ విద్యార్థులు మరణించిన ఘటనలో సంచలనం సృష్టించింది. నోవోగరోడ్ సిటీలో ఉన్న స్టేట్ యూనివర్సిటీలో ఆ విద్యార్థులు వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. వారు అక్కడి నది దగ్గరకు వెళ్లగా.. ఓ అమ్మాయి నదిలో కొట్టుకుపోయింది. ఆమెను కాపాడే క్రమంలో మరో ముగ్గురు మృతి చెందారు. వారి మృతదేహాలను భారత్‌కు పంపేందుకు ఇండియన్ ఎంబసీ సిద్ధమైంది.