దక్షిణాఫ్రికా అమ్మాయిలతో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత అమ్మాయిలు ఘన విజయం సాధించారు. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 37 పరుగుల లక్ష్యాన్ని 9.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా చేధించారు. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 266 & 373 పరుగులు చేయగా.. భారత్ 603/6 & 37 రన్స్ చేసి విజయం సాధించింది. భారత జట్టుతో బ్యాట్‌తో షఫాలీ, స్మృతి, హర్మన్‌ప్రీత్, జేమీమా, రిచా.. బాల్‌తో స్నేహ్ రాణా, దీప్తీ శర్మ, రాజేశ్వరీ రాణించారు.