Homeహైదరాబాద్latest Newsఅభివృద్ధి, సంక్షేమమే కాంగ్రెస్ సర్కారు లక్ష్యం

అభివృద్ధి, సంక్షేమమే కాంగ్రెస్ సర్కారు లక్ష్యం

ఇదేనిజం, లక్షెట్టిపేట: అభివృద్ధి, సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని, మత్తు పదార్థాలను ఉక్కు పాదంతో అణిచి వేస్తామని, హుక్కాను నిషేదిస్తూ అసెంబ్లీ తీర్మానం చేయడం చాలా హర్షనీయమని పెద్దపల్లి పార్లమెంట్ సీనియర్ నాయకులు కట్కూరి సందీప్ పేర్కొన్నారు. సోమవారం అయన పలు వార్డుల్లో పర్యటించి తమ పార్టీ సిద్ధాంతాలను యువతకు వివరించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలన కొనసాగిస్తున్నారన్నారు. గత ప్రభుత్వం యువతకు ఉద్యాగాలు ఇవ్వకుండా మత్తు పదార్థాలకు బానిసలుగా చేసిందని మండిపడ్డారు. సింగరేణి బిడ్డలకు హై పవర్ వేతనాలు అందించడానికి గత ప్రభుత్వం జీవోను అమలు చేయలేక పోయిందని, కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మాత్రం ఈ జీవోను అమలు చేసి హై పవర్ వేతనాలు విడుదల చేయాల్సిందిగా హై-కమాండ్ దృష్టికి తీసుకువెళ్తానని మాట ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గుగ్గిళ్ళ సత్యనారాయణ, గుగ్గిళ్ళ అవినాష్, ముల్కల అశోక్, గుగ్గిళ్ళ అఖిల్, శనిగారపు వంశీ రాజ్, రవికుమార్ వేముల, గంగపురి శ్రీనివాస్, ఉప్పులేటి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img