తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్‌ఎస్ నేత, స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి పిచ్చివాడిలా మాట్లాడుతున్నారని, ఆయన ఏం మాట్లాడుతున్నారో ఎవరికీ అర్థం కావడం లేదన్నారు. హైదరాబాద్ లో ఆయన తాటికొండ రాజయ్య … సీఎం అజ్ఞానిలా మాట్లాడుతున్నారని అన్నారు.దిల్‌సుఖ్ నగర్‌లో విమానాలు కొనడానికి దొరుకుతున్నాయని ఒకసారి అంటారని, హైదరాబాద్‌కు మూడు వైపులా సముద్రం ఉంటుందని మరోసారి అంటారని ఎద్దేవా చేశారు. తెలంగాణ పాలన పిచ్చివాడి చేతిలో రాయిలా ఉందన్నారు. ఆయన తెలివిగా మాట్లాడుతున్నాడా? తెలివి లేకుండా మాట్లాడుతున్నావా..? అని విమర్శించారు.పాలనపై పట్టులేకనే పార్టీ ఫిరాయిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా దాటవేత ధోరణి అవలంభిస్తున్నారని వ్యాఖ్యానించారు.