HomeతెలంగాణTSPSC చైర్మన్​ రాజీనామా గవర్నర్​ ఆమోదించలేదు

TSPSC చైర్మన్​ రాజీనామా గవర్నర్​ ఆమోదించలేదు

– ప్రకటన విడుదల చేసిన రాజ్​భవన్

ఇదే నిజం, హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్పీఎస్సీ) చైర్మన్‌ బి.జనార్దన్‌రెడ్డి రాజీనామాను గవర్నర్‌ తమిళిసై ఆమోదించలేదు. ఈ మేరకు రాజ్‌భవన్‌ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. జనార్దన్‌రెడ్డి రాజీనామాను ఆమోదించినట్లు ప్రచారం జరిగిన నేపథ్యంలో రాజ్‌భవన్‌ క్లారిటీ ఇచ్చింది. ఆయన రాజీనామా ఆమోదం పొందినట్లు వచ్చిన వార్తలు అవాస్తవమని తెలిపింది. సోమవారం సాయంత్రం సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన అనంతరం టీఎస్పీఎస్సీ ఛైర్మన్‌ పదవికి జనార్దన్‌రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పాండిచ్చేరి పర్యటనలో ఉన్న గవర్నర్‌కు అన్ని వివరాలు పంపించామని రాజ్‌భవన్‌ వర్గాలు తెలిపాయి.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img