ఇదే నిజం, కమలాపూర్: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో శనివారం రోజున కురిసిన అకాల వర్షం కారణంగా రైతులు పండించిన ధాన్యం తడిసి ముద్దయింది. ఆరు నెలల పాటు చెమటోడ్చి పండించిన దాన్యం చేతికి వచ్చే సమయంలో ఇలా వర్షం కారణంగా తడిసి ముద్దవ్వడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఇన్ని రోజులు కష్టపడి పండించిన ధాన్యం అకాల వర్షం వల్ల దెబ్బతిందని, ఐకెపి యాజమాన్యం తడిసిన ధాన్యాన్ని సైతం ఎటువంటి తరుగు లేకుండా మొత్తం ధాన్యాన్ని కొనాలని అలాగే వర్షం వల్ల ఎక్కువ దిగుబడి వచ్చే పంట కొంత నష్టపోయే అవకాశం ఉందని, ప్రభుత్వం స్పందించి కొంత ఆర్థిక సాయం అందించి రైతులను ఆదుకోవాలని వారు కోరారు.