Homeహైదరాబాద్latest Newsపిన్నెల్లి అరెస్ట్‌కు రంగం సిద్ధం.. రేపు ఉదయం అరెస్ట్ చేసే అవకాశం..!

పిన్నెల్లి అరెస్ట్‌కు రంగం సిద్ధం.. రేపు ఉదయం అరెస్ట్ చేసే అవకాశం..!

పిన్నెల్లి అరెస్ట్‌కు రంగం సిద్దమయ్యింది. ఆయనను రేపు ఉదయం అరెస్ట్ చేసే అవకాశం ఉంది. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై అనేక కేసులున్నాయి. పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎంల ధ్వంసం కేసుతో పాటు మూడు హత్యాయత్నం కేసులు ఆయనపై నమోదయ్యాయి. ఆయన నరసరావుపేటలోని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నివాసంలో ఉండటంతో ఆ ఇంటి బయట పోలీసులు పెద్ద సంఖ్యలో మొహరించారు.

మరోసారి తప్పించుకోకుండా ఉండేందుకు ఆయనను అక్కడి నుంచి కదలనివ్వకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఆయన హైకోర్టుకు వెళ్లి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. ఈ నెల 6వ తేదీ వరకూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయవద్దంటూ హైకోర్టు మధ్యంతర ఆదేశాలను ఇచ్చింది. అయితే సుప్రీంకోర్టు మాత్రం పిన్నెల్లిని కౌంటింగ్ కేంద్రానికి వెళ్లవద్దని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆయన బస చేసిన ప్రాంతంలో పోలీసులు పెద్దయెత్తున మొహరించారు.

Recent

- Advertisment -spot_img