పూణె జిల్లాలోని పౌడ్ గ్రామ సమీపంలో ఓ ప్రైవేట్ హెలికాప్టర్ కుప్పకూలింది. హెలికాప్టర్ ప్రైవేట్ ఏవియేషన్ కంపెనీకి చెందిందని అక్కడి పోలీసులు తెలిపారు. ముంబై నుంచి హైదరాబాద్‌కు వెళుతుండగా ప్రమాదం చోటు చేసుకున్నట్లు చెప్పారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాతావరణం అనుకూలించకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో హెలికాప్టర్‌లో పైలట్‌తో సహా నలుగురు ప్రయాణిస్తున్నారని అధికారులు తెలిపారు. అదృష్టవశాత్తూ వీరంతా గాయాలతో బయటపడ్డారని పోలీసులు తెలిపారు. అయితే వారికి స్వల్ప గాయాలు కావడంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.