తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. అక్టోబర్ నుంచి దరఖాస్తులు తీసుకోవాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన విధి విధానాలను మరో సమావేశంలో రూపొందిస్తామని ఉత్తమ్ ప్రకటించారు. ఇతర రాష్ట్రాల్లో రేషన్ పంపిణీని అధ్యయనం చేసి ప్రజలకు మేలు జరిగే విధంగా చూస్తామని చెప్పారు.