Homeసినిమాబాలయ్య బాబుతో సినిమా వేరే లెవెల్​

బాలయ్య బాబుతో సినిమా వేరే లెవెల్​

నందమూరి బాలకృష్ణ , దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఎన్​బీకే 109గా వర్కింగ్​ టైటిల్​తో తీస్తున్న ఈ సినిమాపై బాబీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘సినిమా ఎలా ఉండనుంది? అంటూ ఫ్యాన్స్ అడుగుతున్నారు. వాళ్లకు ఒక్కటే మాట ఇస్తున్నా. వేరే లెవెల్‌లో ఉంటుంది. ఇటీవల ఊటీలో ఒక భారీ యాక్షన్‌ షెడ్యూల్‌ పూర్తి చేశాం. తదుపరి షెడ్యూల్‌ కోసం రాజస్థాన్‌ వెళ్లనున్నాం. మా చిత్రానికి సంబంధించిన అప్‌డేట్స్‌ వచ్చే ఏడాదిలో ఇస్తాం’అని ఆయన చెప్పారు. ‘భగవంత్‌ కేసరి’ తర్వాత బాలకృష్ణ నటిస్తోన్న సినిమా ఇది. పవర్‌ఫుల్‌ యాక్షన్‌ కథాంశంతో వస్తున్న ఈ సినిమా రెగ్యులర్‌ షూట్‌ నవంబర్‌ నుంచి మొదలైంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్రబృందం గతంలో ఓ పోస్టర్‌ రిలీజ్ చేసింది. ‘బ్లడ్‌ బాత్‌కు బ్రాండ్‌ నేమ్‌.. వయలెన్స్‌కు విజిటింగ్‌ కార్డ్‌’ అనే క్యాప్షన్‌తో రిలీజ్‌ చేసిన ఈ పోస్టర్‌ సినీ లవర్స్​ను ఆకర్షించింది. సితార ఎంటర్‌టైనర్‌మెంట్‌ పతాకంపై సూర్య దేవరనాగవంశీ, సాయి సౌజన్య దీన్ని నిర్మిస్తున్నారు. ఇక, ఈ చిత్రంలోని ఓ కీలక పాత్రలో దుల్కర్‌ సల్మాన్‌ కనిపించనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తమన్నాతో ఓ స్పెషల్‌ సాంగ్‌ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ వార్తలపై టీమ్‌ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

Recent

- Advertisment -spot_img