Homeసినిమా‘నా సామిరంగ’ పాటల సందడి

‘నా సామిరంగ’ పాటల సందడి

టాలీవుడ్​ కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా దర్శకుడు విజయ్ బిన్నీ కాంబినేషన్​లో తెరకెక్కతున్న యాక్షన్ ఎంటర్​టైనర్ ‘నా సామిరంగ’. ఈ సినిమా షూటింగ్​ వేగంగా జరుగుతుండగా.. ఫ్యాన్స్​ కూడా ఎగ్జయిటింగ్​గా ఎదురుచూస్తున్నారు. నాగ్ కెరీర్ లో 99వ సినిమాగా రాబోతున్న ‘నా సామిరంగ’కు సంబంధించి పాటల రచయిత చంద్రబోస్ ఇంట్రెస్టింగ్​ అప్​డేట్​ను అందించారు. సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, నాగార్జునతో కలిసి ఉన్న పిక్​ను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. పాటల సందడిలో బిజీగా ఉన్నట్లు తెలిపారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ సంస్థ ఈ మూవీని నిర్మిస్తోంది.

Recent

- Advertisment -spot_img