Homeతెలంగాణఅధికారి రాలే.. దరఖాస్తులు తీసుకోలే !

అధికారి రాలే.. దరఖాస్తులు తీసుకోలే !

– చింతలమానేపల్లి మండలం దిందా గ్రామంలో ఘటన

ఇదే నిజం, చింతలమానేపల్లి: ఆరు గ్యారెంటీల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన కింద దరఖాస్తులను స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. కుమ్రం భీం ఆసిఫాబాద్​ జిల్లా చింతలమానేపల్లి మండలం దిందా గ్రామంలో గురువారం ప్రజా పాలన కార్యక్రమం నిర్వహించారు. దరఖాస్తుల స్వీకరణకు అధికారులు లేకపోవడంతో ప్రజలు ఉదయం నుంచి ఎదురు చూడాల్సి వచ్చింది. అధికారులు వస్తారని సాయంత్రం మూడు గంటల వరకు ప్రజలు వేచి చూశారు. ఎంతకూ అధికారి రాకపోవడంతో ప్రజలు నిరాశగా వెనుదిరిగారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img