Homeరాజకీయాలుకాంగ్రెస్​ మెడలు వంచి జనమే రాష్ట్రం సాధించుకున్నరు

కాంగ్రెస్​ మెడలు వంచి జనమే రాష్ట్రం సాధించుకున్నరు

– ఆ పార్టీని తెలంగాణ ప్రజలు ఎప్పటికీ క్షమించరు
– కేంద్రమంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్​ కిషన్ రెడ్డి

ఇదే నిజం, హైదరాబాద్‌: తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్‌ అన్ని విధాలుగా అన్యాయం చేసిందని కేంద్రమంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్​ కిషన్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం నాంపల్లిలో బీజేపీ అభ్యర్థి రాహుల్‌చంద్రకు మద్దతుగా ఆయన ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని ప్రజలను ఆయన అభ్యర్థించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి.చిదంబరం చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. తెలంగాణను కాంగ్రెస్‌ ఇవ్వలేదని.. ప్రజలే ఆ పార్టీ మెడలు వంచి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నారని చెప్పారు. అనేక మంది ఉద్యమకారుల ఆత్మబలిదానాలతో తెలంగాణ ఏర్పడిందన్నారు. కాంగ్రెస్‌ పార్టీని ప్రజలు ఎప్పటికీ క్షమించరన్నారు.

Recent

- Advertisment -spot_img