Homeహైదరాబాద్latest Newsఉపాధి కూలీలకు టోక్రా ఇచ్చిన పోస్ట్ మాన్

ఉపాధి కూలీలకు టోక్రా ఇచ్చిన పోస్ట్ మాన్

ఫీల్డ్ అసిస్టెంట్ ప్రోద్బలంతోనే మోసం జరిగిందన్న ఉపాధి కూలీలు

ఇదే నిజం, గూడూరు: మండలంలోని పొనుగోడు గ్రామపంచాయతీ పోస్ట్ మాన్ గా పనిచేస్తున్న శరత్, టేకుల తండా కు చెందినఉపాధి హామీ కూలీలకు ఘరానా మోసం చేసిన విషయం ఆలస్యంగా వెలులోనికి వచ్చింది. వివరాల్లోనికి వెళ్తే, మే నెల 24వ తారీఖున పొనుగోడు గ్రామపంచాయతీలోని, టేకుల తండాకు వెళ్లి ఉపాధి హామీ డబ్బులు ఇస్తానని చెప్పి, పే స్లిప్ లపై వారి ఎకౌంట్ నెంబర్స్ వివరాలను నమోదు చేసుకొని, వారి సంతకాలు చేయించకుండానే, గూడూరు సబ్ పోస్ట్ ఆఫీస్ నుండి డబ్బులు తెచ్చి ఇస్తానని చెప్పి, తానే ఫోర్జరీ సంతకాలు చేసి, ఉపాధి హామీ కూలీలకు సంబంధించిన డబ్బులను సహా చేసి, సదరు పోస్ట్ ఆఫీస్ లో, పే స్లిప్పులను ఇచ్చి, మహబూబాబాద్ హెడ్ ఆఫీస్ కు చేరవేయడం జరిగింది.

వారం రోజులు కావస్తున్న డబ్బులు ఇవ్వలేదనే అనుమానం వచ్చిన ఉపాధి హామీ కూలీలు ఆరా తీయగా, మోసపోయామని జూన్ 6వ తారీఖున తెలుసుకొని, పోస్ట్ ఆఫీస్ కార్యాలయానికి చేరుకొని ఆరా తీయగా, విధులకు హాజరు కావడం లేదనే విషయం తెలుసుకుని కంగుతిన్న ఉపాధి హామీ కూలీలు, సరాసరి గూడూరులో గల సబ్ పోస్ట్ ఆఫీస్ కార్యాలయానికి చేరుకొని పొనుగోడు పోస్ట్ మాన్ శరత్ పై ఫిర్యాదు చేయగా, కంగుతిన్న సదరు ఇన్చార్జి పోస్ట్ మాన్ చామకూరి ఉపేందర్. పోస్టుమ్యాన్ కు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వస్తున్న క్రమంలో, పై అధికారులకు ఫిర్యాదు చేశారు. దాదాపు లక్ష రూపాయలు ఉపాధి కూలీలకు టోక్రా ఇచ్చినట్లు సమాచారం. దీనిపై ఫీల్డ్ అసిస్టెంట్ వీరు నాయక్ ను వివరణ కోరగా, నాకు ఎలాంటి సంబంధం లేదని, నీ దిక్కున చోట చెప్పుకో, ఫిర్యాదు చేసుకున్న నాకేమీ కాదని,ఉపాధి హామీ కూలీలను బుఖాహించాడు. పోస్ట్ ఆఫీస్ లో ఉపాధిహామీ డబ్బులను తంబు రూపంలో ఉన్న విధానానికి స్వస్తి పలికి, పే స్లిప్పులను జారీ చేయడంతోనే ఇలాంటి సంఘటనలకు తావిచ్చినట్లు అయిందని, పే స్లిప్పులను పోస్ట్ ఆఫీస్ కార్యాలయం వారు సరఫరా చేయకుండా, జిరాక్స్ సెంటర్లపై, 5 రూపాయల చొప్పున కొని తెచ్చుకొని ఆధారపడే విధంగా, కూలీలకు అదనపు భారం వేస్తున్నారు. అదేవిధంగా పెన్షన్ దారులు కూడా 2016, 4016 రావడం వల్ల, చిల్లర సాకుతో దారుణంగా పోస్ట్ మ్యాన్ ల చేతుల్లో దారుణంగా మోసపోతున్నారని, అధికారులందరికి ఈ విషయాలన్నీ తెలిసినా, ఏమీ తెలియనట్లుగా వ్యవరిస్తున్న తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img