Homeహైదరాబాద్latest Newsజూనియర్ కళాశాలల సమస్యలు పరిష్కరించాలి

జూనియర్ కళాశాలల సమస్యలు పరిష్కరించాలి

ఇదేనిజం, కరీంనగర్ ఎడ్యుకేషన్: ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలని, ప్రభుత్వ కళాశాలల్లోని సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు ఆసంపెల్లి వినయ్ కోరారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం జిల్లా ఇంటర్మీడియట్ అధికారి వెంకటేష్ కు వినతి పత్రం అందజేశారు. వినయ్ మాట్లాడుతూ కరీంనగర్ లో నారాయణ లాంటి కార్పొరేటర్ కళాశాలలల్లో విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ అధికారులు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలల్లో సరిపడా అధ్యాపకులు లేరని, మరుగుదొడ్లు, మూత్రశాలలు, త్రాగునీరు సౌకర్యం తదితర మౌలిక వసతులు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు. డిఐఓ ఇంటర్మీడియట్ కళాశాలలల్లో పర్యవేక్షణ చేయడం లేదని, ఇప్పటికైనా జిల్లా వ్యాప్తంగా ఉన్న ఇంటర్మీడియట్ కళాశాలలను సందర్శించి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. అలాగే మండలకేంద్రాల్లోని జూనియర్ కళాశాలలల్లో నూతన వృత్తివిద్య కోర్సులను ప్రవేశపెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు తిప్పారావ్ రోహిత్, జిల్లా కమిటీ సభ్యులు సందేశ్, సద్నిత్ కుమార్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img