HomeSocial Mediaతెలంగాణలో గప్పుడు దొరలు.. గిప్పుడు రెడ్డీలు..!

తెలంగాణలో గప్పుడు దొరలు.. గిప్పుడు రెడ్డీలు..!

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: ‘కాంగ్రెస్​అంటేనే రెడ్ల పార్టీ’ అనేది ఎప్పటినుంచో జనంలో ఒక నిశ్చితమైన అభిప్రాయం ఉంది. అందుకు తగ్గట్టే ఆ పార్టీలో రెడ్డి సామాజికవర్గం లీడర్లు ఎక్కువ సంఖ్యలో కనిపిస్తుంటారు. ఆజమాయిషీ కూడా వారిదే ఉంటుంది. గతంలో పలు సందర్భాల్లో రేవంత్​రెడ్డి కూడా ‘‘రెడ్డిలకే పార్టీలను నడిపే బాధ్యతను అప్పగించాలి.. రెడ్డిలకే ఆ సత్తా ఉంది” అని పదేపదే వెళ్లడించారు. మరోవైపు రాష్ట్ర కాంగ్రెస్​లో రెడ్లు, దళితులకు ప్రాధాన్యం ఉన్నట్టు కనిపిస్తుంది. దీని దృష్టిలో ఉంచుకొనే గతంలో ఎన్టీఆర్ బీసీలను ఎంకరేజ్​చేశారు. ఇదిలా ఉంటే తాజాగా రాష్ట్ర కాంగ్రెస్​ పార్టీలో మరోసారి రెడ్డి డామినేషన్​చాలా క్లియర్​గా కనిపిస్తోంది. ఈ పరిస్థితి అందరూ ఊహించిందే అయినా.. ఇంత త్వరగా రెడ్డి సామాజికవర్గం కాంగ్రెస్​పార్టీలో పాతుకుపోతుందని ఎవరూ అంచనావేయలేదు. మంత్రివర్గంలో, అధికార యంత్రాంగంలో స్పష్టంగా రెడ్ల మార్క్​ కనిపిస్తోంది. అంతకుముందు టికెట్ల కేటాయింపులోనూ ఈ అంశం తేటతెల్లమైంది. బీఆర్ఎస్​ లాంటి పార్టీలోనూ రెడ్ల సంఖ్య గణనీయంగా ఉన్నప్పటికీ .. ప్రస్తుతం కాంగ్రెస్​ పార్టీలో మాత్రం ఈ విషయం చాలా స్పష్టంగా కనిపిస్తోంది.

సీఎంతోపాటూ కీలక మంత్రులు రెడ్లే
ముఖ్యమంత్రి పదవి రేవంత్ రెడ్డికి దక్కడంతో కీలక శాఖలు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు దక్కుతాయని భావించారు. కానీ మంత్రి మండలిలోనూ రెడ్లకే ప్రాధాన్యం దక్కింది. ఉత్తమ్ కుమార్​ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి.. ఇలా ముఖ్యమంత్రి పదవితో పాటూ మూడు కీలకశాఖలు రెడ్డి సామాజికవర్గానికే దక్కాయి. కాంగ్రెస్​ పార్టీ 64 చోట్ల విజయం సాధిస్తే.. మెజార్టీ సంఖ్యలో రెడ్లే ఉండటం తెలిసిందే. దీంతో రాష్ట్రంలో దొరల రాజ్యం పోయి.. రెడ్ల రాజ్యం వచ్చిందని ప్రజల్లో జోరుగా చర్చ సాగుతోంది.

పాలనా యంత్రాంగంలోనూ .. పట్టు వారిదే
రాష్ట్ర పాలనపరమైన అంశంలోనూ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా తన రెడ్డి మార్క్​ చూపించారు. కీలకమైన అడ్మినిస్ట్రేషన్​విభాగాల్లోనూ సమర్థులైన రెడ్డి ఐ.ఎ.ఎస్​, ఐ.పి.ఎస్ అధికారులకు అగ్ర ప్రాధాన్యం ఇచ్చారు. పలు కీలక శాఖల్లోని ప్రాధాన్య పోస్టుల్లోనూ రెడ్లకే పోస్టింగ్​ఇవ్వడం ఇందుకు ఉదాహరణ.

బీసీలకు అవ్వకాశం ఇవ్వండి
అతి త్వరలో అధిష్ఠానం పెద్దల సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం నామినేటెడ్​ పోస్టులను భర్తీచేయనుంది. ఆ పోస్టుల్లోనైనా తమకు సముచిత స్థానం ఇవ్వాలని బీసీ వర్గాలు డిమాండ్​చేస్తున్నాయి. పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో బీసీలు గణనీయమైన పాత్ర పోషించారని.. వారి సేవలను గుర్తిస్తూ ప్రదేశ్​ కాంగ్రెస్​ కమిటీ (పీసీసీ) చీఫ్​ పదవిని కూడా తమకు ఇవ్వాలని బీసీ వర్గాలు డిమాండ్​ చేస్తున్నాయి.

Recent

- Advertisment -spot_img