Homeహైదరాబాద్latest Newsచెట్టును ఢీకొన్నఆర్టీసీ బస్సు

చెట్టును ఢీకొన్నఆర్టీసీ బస్సు

– ముగ్గురికి తీవ్ర గాయాలు

ఇదే నిజం, జిన్నారం : ఆర్టీసీ బస్సు చెట్టుని ఢీకొన్న ఘటన సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం పరిధిలోని రాళ్లకత్వ గ్రామంలో బుధవారం ఉదయం జరిగింది. ఆర్టీసీ బస్సు ప్రయాణికులు గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. మెదక్ జిల్లా నర్సాపూర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఉదయం 9 గంటల ప్రాంతంలో నర్సాపూర్ నుంచి వయా సోలక్ పల్లి మీదుగా పటాన్ చెరు వెళ్తుండగా, రాళ్లకత్వ గ్రామంలో రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీ కొట్టింది. బస్సు అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు తెలిపారు. బస్సును అతివేగంగా నడిపి ప్రమాదానికి కారణమైన డ్రైవర్ ను రాళ్లకత్వ గ్రామస్తులు మందలించారు. ఈ ఘటనలో బస్సులో ఉన్న 30 మందికి స్వల్ప గాయాలు, ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి కాట శ్రీనివాస్ గౌడ్, జిన్నారం ఎంపీపీ రవీందర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వడ్డే కృష్ణ, మాజీ సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డిలు పరామర్శించారు.

Recent

- Advertisment -spot_img