Homeక్రైంబైక్​ను ఢీకొట్టిన స్కూల్ బస్సు

బైక్​ను ఢీకొట్టిన స్కూల్ బస్సు

– చిన్నారి మృతి.. తండ్రికి గాయాలు
– ములుగు జిల్లాలో ఘటన

ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: బైక్​ను స్కూల్ బస్సు ఢీకొట్టడంతో చిన్నారి చనిపోగా.. ఆమె తండ్రి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన ములుగు జిల్లా సమ్మక్క, సారక్క తాడ్వాయి మండలం నార్లాపూర్ గ్రామంలో జరిగింది. వివరాళ్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన ఖాతా రమేశ్​కు ఏడాది వయసున్న కూతురు ఉంది. శుక్రవారం కూతురితో కలిసి బైక్​పై బయటికెళ్లాడు. అతడి బైక్​ను స్కూల్ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. రమేశ్ తీవ్రంగా గాయపడగా.. స్థానికులు అతడిని ములుగు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Recent

- Advertisment -spot_img