Homeజిల్లా వార్తలుపేదలకు ఇంటి జాగ దక్కేవారకు పోరాటం ఆగదు

పేదలకు ఇంటి జాగ దక్కేవారకు పోరాటం ఆగదు

– సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు నాగయ్య

ఇదే నిజం, వరంగల్: పేదలకు ఇంటి జాగ దక్కేవారకు పోరాటం ఆగదని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు నాగయ్య అన్నారు. గురువారం సీపీఎం పార్టీ కార్యాలయంలో పట్టణ కార్యదర్శి బానోతు సీతారాం నాయక్ అధ్యక్షతన జరిగిన భూ పోరాట కేంద్ర టీమ్ లీడర్స్ ల సమావేశంలో నాగయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మానుకోట జిల్లా కేంద్రంలోని కురవి గేటు సమీపంలో సర్వే నంబర్ 255/1 గత సంవత్సర కాలంగా సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ఇండ్లు లేని నీరు పేదలు ఇండ్లు వేసుకొని నివసిస్తున్నారు. ఆ భూమిని ఆక్రమించిన భూకబ్జాదారుల అధికారులతో పేదల గుడిసెలపై 19సార్లు జేసీబీలతో దాడులు చేసి ఇండ్లను ధ్వంసం చేసి సీపీఎం నాయకులపై అనేక అక్రమ కేసులు పెట్టడం దారుణమన్నారు. మహిళలపై అనేక కేసులు చిత్ర హింసలకు గురిచేసి రాత్రి వేళల్లో జైలుకు పంపించారని ఆరోపించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి సాధుల శ్రీనివాస్, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సుర్ణపు సోమయ్య, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు చిపిరి యాకయ్య, పట్టణ కమిటీ సభ్యులు బానోతు వెంకన్న, తోట శ్రీనివాస్ యమగని వెంకన్న, నాయకులు బూర్గుల లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img