– కరీంనగర్‌లోని గోపాల్‌పూర్‌లో ఘటన
– ప్రభుత్వ టీచర్‌పై కేసు నమోదు
ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: మంత్రి గంగుల కమలాకర్ ప్రచార వాహనంపై ఓ ప్రభుత్వ టీచర్ చెప్పుతో దాడి చేశాడు. దీంతో అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కమలాకర్‌కు చెందిన ఎల్ఈడీ వాహనం కరీంనగర్ సిటీలోని గోపాల్‌పూర్‌లో తిరుగుతోంది. ఈ క్రమంలో టీచర్ జగదేశ్వరాచారి ఆ వాహనాన్ని చెప్పుతో కొట్టాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు.