Homeహైదరాబాద్latest Newsద్విచక్ర వాహనాలు చోరీ చేసిన దొంగ అరెస్ట్..!

ద్విచక్ర వాహనాలు చోరీ చేసిన దొంగ అరెస్ట్..!

ఇదే నిజం, మెట్ పల్లి రూరల్: గత కొన్నాళ్లుగా మెట్ పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, కోరుట్ల మండలాల్లో ద్విచక్ర వాహనాల దొంగతనం తాలుక దొంగను గురువారం మెట్ పల్లి పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నట్లు మెట్ పల్లి డిఎస్పి ఉమా మహేశ్వర్ రావు కార్యాలయంలో నిందితుడిని అరెస్ట్ చేసి వేలేకరుల సమావేశంలో చూపారు. నిందితుడు మెట్ పల్లి మండలం సత్తక్కపల్లి గ్రామానికి చెందిన షేక్ ఇస్మాయిల్ గా తెలిపారు. ఇస్మాయిల్ ఆటో నడుపుతూ.. వచ్చిన డబ్బుతో తాగి, జల్సాలు చేసేవాడు అని, డబ్బులు సరిపోక రద్దిగా ఉండే చోట్ల హ్యాండిల్ లాక్ వెయని 20 ద్విచక్ర వాహనాలను దొంగలించినట్టు తెలిపారు. ఇట్టి వాహనాలను కోరుట్ల, కమ్మర్పల్లి, మెర్తాడ్,పెర్కిట్, ఆర్మూర్, నిజమాబాద్,జగిత్యాల, గంగాధర లలో వాహనాల విడి భాగలను వేరు చేసే వారికి ఒక్కో వాహనం 5 వేల రూపాయల చొప్పున అమ్మినట్లు తెలిపారు. నిందితుడి పై మెట్ పల్లి, కోరుట్ల, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం మండలాల్లో 20 కేసులు నమోదు కావడంతో మెట్ పల్లి పోలీసులు టెక్నాలజీతో నిందితుడిని పట్టుకునేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని వివరించారు. అనుమానంతో పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద వాహనాల తనికిలో ఏ ఆధారాలు లేని వాహనం పై ఇస్మాయిల్ రావడంతో విచారణ చేపట్టగా, నిందితుడు ద్వారా గత దొంగతనాల తాలూకా వివరాలను విచారించి తెలుసుకున్నారు. గత 18 నెలలుగా ఈ వ్యవహారం నడుస్తున్నట్టు నిందితుడు లేలిపాడని చెప్పుకొచ్చారు. నిందితుడి దగ్గరి నుండి 3 వాహనాలతో పాటు ఆరు లక్షల నగదు స్వాదినం చేసినట్టు చూపించారు. ఈ కేసు లో ఇస్మాయిల్ తో పాటు వాహనాలు కొనుగోలు చేసిన 17 మంది పై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. అంతేకాకుండా ఆర్మూర్ మున్సిపాల్ వైస్ చైర్మన్ షేక్ మున్నా పాత్ర ఉన్నట్టు తెలిపారు. ఇట్టి కేసును చెందించిన సీఐ నవీన్, ఎస్సై చీరంజీవి, ఎఎస్సై బెక్, ఆంజనేయులు, కానిస్టేబుల్లు అశోక్, కిరణ్, సంతోష్ లను డిఏస్పీ అభినందించారు.

Recent

- Advertisment -spot_img