Homeహైదరాబాద్latest Newsదొంగల బీభత్సం..

దొంగల బీభత్సం..

– ఇంటి కిటీకి స్కూలు తీసి రూ.40వేలు చోరీ
– నల్లబెల్లి మండలం నందిగామ గ్రామంలో ఘటన

ఇదేనిజం, నల్లబెల్లి : నల్లబెల్లి మండలం దొంగలు బీభత్సం సృష్టించారు. నందిగామ గ్రామంలో ఇస్లావత్ తిరుపతి దుకాణంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. బుధవారం సాయంత్రం కిరాణా షాపు యజమాని తిరుపతి బంధువుల ఇంటికి వెళ్లి గురువారం సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చాడు. వచ్చాక షాపులోని డబ్బులు చూసుకుంటే రూ.40 వేలు తక్కువ వచ్చాయి. అనుమానంతో ఇళ్లంతా పరిశీలించగా ఇంటి వెనకాల ఉన్న కిటికీ స్క్రూలు తీసి వుండటం గమనించాడు. వెంటనే పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. కిరాణా షాప్ యజమాని తిరుపతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గతంలో కూడా నందిగామలో ఒక బైక్, గొర్రెలు, మోటార్లు దొంగతనాలు కూడా జరగడంతో గ్రామస్థులు ఆందోళనకు గురవుతున్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img