Homeహైదరాబాద్latest Newsకరెంట్ వైర్లుతో ప్రజలకు పొంచి ఉన్న ముప్పు బీజేపీ ఆధ్వర్యంలో కరెంట్ ఏఈ కి వినతి...

కరెంట్ వైర్లుతో ప్రజలకు పొంచి ఉన్న ముప్పు బీజేపీ ఆధ్వర్యంలో కరెంట్ ఏఈ కి వినతి పత్రం

ఇదే నిజం, కోహెడ: కరెంటు సమస్యలపై కోహెడ సబ్ స్టేషన్ ఏఈ రవీందర్ గారికి బిజెపి శ్రేణులు వినతిపత్రం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా బిజెపి మండల అధ్యక్షుడు ఖమ్మం వేంకటేశం పత్రిక సమావేశంలో మాట్లాడుతూ కోహెడ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ వెనకాల ఉన్న కాలనిలో ఇండ్ల మీదుగా 11.కే.వి. కరెంట్ లైన్ ఉన్నదని గతంలో చాలాసార్లు మొరపెట్టుకొన్న సందర్భంలో విద్యుత్ శాఖ అధికారులు పరిశీలించి వీలైనంత తొందరగా పోలీస్ స్టేషన్ ముందువైపున నుండి 11.కేవీ. లైన్ తిస్తామని చెప్పినప్పటికీ నేటికి ఆచరణలో కనబడకపోవడంతో తరుచూ ప్రమాదాలు సంభవిస్తున్న విషయాన్ని మరోసారి విద్యుత్ శాఖ అధికారులకు గుర్తుచేస్తూ త్వరగా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజల తరపున విజ్ఞప్తి చేశామన్నారు ఏఈ కూడా ఉన్నతాధికారులకు చెప్పాము త్వరలోనే సమస్య పరిష్కరిస్తామని చెప్పారన్నారు.

అలాగే అభివృద్ధి చెందుతున్న కోహెడ మండల కేంద్రంలో కొత్త కొత్తగా కాలనీలుగా ఏర్పడుతున్నాయి. కొత్తగా ఇండ్ల నిర్మాణాలు చేసుకొని అందులో నివసిస్తున్నారు వారి ఇంటికి విద్యుత్ కనెక్షన్లు తీసుకోవాలన్న దూర ప్రాంతాల నుండి తీసుకున్నప్పటికీ ఆ కాలనీల్లో విద్యుత్ స్తంభాలు లేకపోవడంతో విధి దీపాలు లేకుండా చిమ్మని చీకట్లో ఉంటున్న పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అట్టి ప్రాంతాలను గుర్తించి నూతన స్తంభాలు ఏర్పాటు చేస్తే గ్రామ పంచాయతీ నుండి విధి దీపాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది.

కాబట్టి విద్యుత్ శాఖ అధికారులు చొరవ తీసుకొని కొత్త కాలనీల్లో కొత్త కరెంటు స్తంభాలు కరెంటు లైన్ ఇవ్వాలని ప్రజల పక్షాన కోరడం జరిగింది. ఏఈ ప్రభుత్వ గైడెలెన్స్ ప్రకారం గ్రామ పంచాయతీ లేదా సదరు ఇంటి యజమాని కరెంటు స్తంభాలకు వైర్ కు డిడి కడితేనే వేయడానికి మాకు ఆదేశాలు ఉన్నాయని చెప్పిన నేపథ్యంలో ఇలాంటి సమస్యలు ఒక్క కోహెడలోనే కాకుండా యావత్ మండల వ్యాప్తంగా ఉన్న నేపథ్యంలో గ్రామాల్లో పాలకవర్గాలు లేనందున ప్రత్యేక అధికారులు చొరవ తీసుకోని గ్రామ పంచాయతీ ల ద్వారానే కరెంటు స్తంభాలు వైర్లకు డీడీలు చెల్లించి కరెంటు ఇప్పించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు గుగ్గిళ్ల శ్రీనివాస్, బండ జగన్ యాదవ్ కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు రామంచ రాంచంద్రరెడ్డి బిజెపి నాయకులు కొండబత్తిని సతీష్,మామిడి కరుణాకర్ గౌడ్, బిజెవైఎం నాయకులు బండ సుమన్ యాదవ్, బిజెపి గ్రామశాఖ అధ్యక్షుడు ముంజ సాగర్ గౌడ్,బూత్ అధ్యక్షుడు ఉత్తునూరు శ్రీకాంత్, బిజెపి నాయకులు ఎడ్ల రాజు, పందిపల్లి రవి, తదితరులున్నారు.

Recent

- Advertisment -spot_img