– ముగ్గురు దుర్మరణం
– సంగారెడ్డి జిల్లాలో ఘటన
ఇదేనిజం, సంగారెడ్డి: ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడటంతో ముగ్గురు దుర్మరణం చెందారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో శనివారం చోటు చేసుకున్నది. సదాశివపేట మండలం కొల్కూరు గ్రామానికి చెందిన మంగలి గోపాల్(30), ఈటల రమణ(45), ఎంపల్లి మల్లేశ్(30) ట్రాక్టరుపై కొల్కూరు వెళ్తుండగా గ్రామ శివారులో ట్రాక్టర్ స్టీరింగ్ విరిగింది. దీంతో ట్రాక్టర్ అదుపుతప్పి పక్కనే ఉన్న వాగులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌పై ఉన్న ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో కొల్కూరు గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.