Homeఫ్లాష్ ఫ్లాష్the vaccine war: ‘ది వ్యాక్సిన్ వార్’ ఫస్ట్​లుక్ విడుదల

the vaccine war: ‘ది వ్యాక్సిన్ వార్’ ఫస్ట్​లుక్ విడుదల

the vaccine war: కశ్మీరీ పండిట్లపై జ‌రిగిన అఘాయిత్యాల నేప‌థ్యంలో తెరకెక్కిన ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ బాక్సాఫీస్‌ దగ్గర సెన్షేషన్ అంతా ఇంతా కాదు. గతేడాది ఫిబ్రవరి చివరి వారంలో రిలీజైన ఈ సినిమా ఏకంగా రూ.350 కోట్లు కొల్లగొట్టి బాలీవుడ్​లో సరికొత్త రికార్డులు నెలకొల్పింది.

ప్రాపగాండ సినిమాగా కొందరు విమర్శించినప్పటికీ.. థియేటర్లలో జనం ఆదరించండంతో హిట్​గా నిలిచింది.​ ఇక ఈ సినిమా దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి పేరు మార్మోగిపోయింది. అలాంటి డైరెక్టర్‌ నుంచి వస్తున్న నెక్స్ట్‌ మూవీ ది వాక్సిన్‌ వార్‌. కరోనా టైమ్‌లో జరిగిన పరిస్థితులు, ఇండియా తీసుకున్న చర్యలు, దేశంలో ఏర్పడ్డ విపత్కర పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. కాగా, తాజాగా ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ రిలీజైంది. సినిమాలోని మెయిన్‌ లీడ్‌లను చూపిస్తూ ‘ఇదొక నిజమైన కథ’ అని చెబుతూ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. పోస్టర్‌లో బాలీవుడ్‌ దిగ్గజాలు నానా పటేకర్‌, అనుపమ్ ఖేర్‌లతో పాటు కాంతారా ఫేమ్‌ సప్తమీ గౌడ, ది కశ్మీర్‌ ఫైల్స్‌ నటులు పల్లవి జోషి, రైమా సేన్​ను చూపించారు. ఇక ఈ సినిమా సెప్టెంబర్‌ 28న పాన్‌ ఇండియా లెవెల్​లో రిలీజ్‌ కానుంది.

Recent

- Advertisment -spot_img