Homeరాజకీయాలువనమా కుటుంబానిది హంతక చరిత్ర

వనమా కుటుంబానిది హంతక చరిత్ర

– అవినీతి సొమ్ము ఇస్తే తీసుకోండి..కానీ కాంగ్రెస్ మిత్రపక్షాన్ని గెలిపించండి
– కొత్తగూడెం ఎన్నికల ప్రచారంలో మాజీ ఎంపీ రేణుకాచౌదరి

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో : కొత్తగూడెం బీఆర్‌ఎస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావుపై మాజీ ఎంపీ రేణుకాచౌదరి నిప్పులు చెరిగారు. బుధవారం ఆమె కొత్తగూడెంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రేణుకాచౌదరి మాట్లాడుతూ కాంగ్రెస్‌కు ద్రోహం చేసిన వనమా కుటుంబానిది హంతక చరిత్ర అన్నారు. కబ్జాకోరు, అవినీతిపరుడు వనమాకు బీఆర్‌ఎస్ టికెట్ ఇవ్వడం దయనీయమన్నారు. ఓటు అనే ఆయుధంతో నిజాయితీపరుడు సాంబశివరావును గెలిపించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు. అవినీతి సొమ్ము ఇస్తే తీసుకున్నా.. కాంగ్రెస్ మిత్రపక్షాన్ని గెలిపించాలని ఆడబిడ్డగా వేడుకుంటున్నట్లు తెలిపారు. ట్రెయిలర్ చూపించి ఓట్లు అడిగే జలగం ఎన్నికలయ్యాక అడ్రస్ ఉండరని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కొత్తగూడెంలో సాంబశివరావును గెలిపిస్తే తామిద్దరం కలిసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిచూపిస్తామన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ అండగా ఉంటామని రేణుకాచౌదరి హామీనిచ్చారు.

Recent

- Advertisment -spot_img