తెలంగాణలోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లారెడ్డి గూడలో దారుణం జరిగింది. శ్రీలక్ష్మి అనే మహిళా తన భర్త విజయ్‌కుమార్‌ను ప్రియుడితో కలిసి హత్య చేసింది. ఆ తర్వాత తన భర్త గుండెపోటుతో చనిపోయాడని బంధువులను నమ్మించింది. శ్రీలక్ష్మి తీరుపై అనుమానం వచ్చిన బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. శ్రీలక్ష్మితో పాటు హత్యకు సహకరించిన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.