HomeTelugu Newsవైన్‌ షాపు తొలగించాలి

వైన్‌ షాపు తొలగించాలి

ఇదేనిజం, కమలాపూర్‌ : తమ జీవితాలను రోడ్డుపాలు చేస్తున్న వైన్‌ షాపును తొలగించాలని పలువురు మహిళలు డిమాండ్‌ చేశారు. హన్మకొండజిల్లా కమలాపూర్‌ మండలం అంబాల గ్రామంలో శ్రీవినాయక వైన్‌ షాప్‌ ముందు మహిళలు, పలువురు గ్రామస్థులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో ఏర్పాటు చేసిన వైన్‌షాపు వల్ల తమ భర్తలు, తమ పిల్లల జీవితాలు నాశనం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో ఏర్పాటుచేసిన షాన్‌షాపును తొలగించకపోతే తమ ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img