Homeక్రైంసొరంగంలో చిక్కుకున్న కూలీలు సేఫ్

సొరంగంలో చిక్కుకున్న కూలీలు సేఫ్

– ఎండోస్కోపీ తరహా కెమెరాలో కనిపించిన దృశ్యాలు

ఇదే నిజం, నేషనల్ బ్యూరో: ఉత్తరాఖండ్‌లో నిర్మాణంలో ఉన్న సొరంగం కూలిపోయిన ఘటనలో చిక్కుకున్న కూలీలంతా క్షేమంగానే ఉన్నారు. దాదాపు 10 రోజులుగా సొరంగంలో ఉన్న వీరి వద్దకు ఆరు అంగుళాల సైజు ఉన్న పైప్​ను పంపించారు. ఆ పైప్‌ ద్వారా ఓ ఎండోస్కోపీ తరహా కెమెరాను పంపగా.. కూలీలంతా సురక్షితంగా ఉన్నట్లు అందులో కన్పించింది. ఈ దృశ్యాలను రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్ ధామి ట్విట్టర్​లో పంచుకున్నారు. సోమవారం రాత్రి ఈ పైప్​ ద్వారా కూలీలకు కిచిడీ, ఇతర ఆహార పదార్థాలను పంపించారు. మొబైళ్లు, ఛార్జర్లను కూడా పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలోనే కూలీలంతా క్షేమంగా బయటకు వస్తారని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Recent

- Advertisment -spot_img