Homeహైదరాబాద్latest Newsజోనల్ కమిషనర్ ఆదేశాలు భేఖాతరు..?

జోనల్ కమిషనర్ ఆదేశాలు భేఖాతరు..?

  • చెరువు బఫర్ లోఅక్రమ నిర్మాణం వదిలేసి.. ప్రహారీ కూల్చీ సరిపెట్టారు.
  • అక్రమ నిర్మాణాల కూల్చివేత విషయంలో శేరిలింగంపల్లి సర్కిల్ అధికారుల వింత పోకడ.

ఇదేనిజం, శేరిలింగంపల్లి: అక్రమ నిర్మాణాల కూల్చివేతల విషయంలో శేరిలింగంపల్లి సర్కిల్- 20 అధికారులు అనుసరిస్తున్న వైఖరి  తీవ్ర చర్చనీయాంశమైంది. చెరువు బఫర్ జోన్ లో వెలిసిన అక్రమ నిర్మాణాల కూల్చివేత లో అధికారుల తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. ఖాజాగూడ పెద్ద చెరువును శిఖం స్థలంలో వెలిసిన అక్రమ నిర్మాణాల కూల్చివేత పేరుతో హడావిడీ చేసిన అధికారులు చుట్టూ ఉన్న ప్రహరీ గోడను కూల్చివేసి మధ్యలో ఉన్న గదిని మాత్రం వదిలేశారు. దీంతో ఎవరి మెప్పు పొందేందుకు ఈ కూల్చివేతలు చేపట్టినట్లు ఒక వేళ కూల్చిన అసలు విషయం వదిలి ప్రహరీ మాత్రం కూల్చారు.  అధికారుల పక్షపాత ధోరణికి కారణం అంతు పట్టడం లేదు. శేరిలింగంపల్లి మండల పరిధిలోని ఖాజాగూడ పెద్ద చెరువు బఫర్ జోన్ ను ఆక్రమించి కొంతమంది కబ్జాదారులు అక్రమ నిర్మాణం చేపట్టారు. ఈ నిర్మాణం మీద ఫిర్యాదు అందుకున్న శేరిలింగంపల్లి జోనల్ అధికారులు కబ్జారాయుళ్లకు మొదట నోటీసులు జారీ చేశారు. అనంతరం జోనల్ కమిషనర్ స్నేహ శబరిష్ ఆదేశాల మేరకు  బుధవారం అక్రమ నిర్మాణం కూల్చివేశారు. కాగా ఇక్కడే అసలు వింత చోటుచేసుకుంది. ఆక్రమించిన స్థలంలో చుట్టూ ఏర్పాటు చేసిన  ప్రహరీ గోడను కూల్చి మధ్యలో ఉన్న గదిని మాత్రం చూసిచూడనట్టు వదిలేయడం ఆశ్చర్యం. అయితే 24 గంటలు గడవక ముందే కబ్జాదారులు అదే గదిలో ఉంటూ పొజిషన్ తీసుకోవడం విశేషం. ఉన్నతాధికారుల ఆదేశాలను పక్కన పెట్టి, అసలు నిర్మాణాన్ని పక్కనపెట్టి, కొసరు కట్టడాలు కూల్చివేయడం  అనేక అనుమానాలకు తావిస్తోంది.

Recent

- Advertisment -spot_img