Homeక్రైంఇంట్లో దొంగతనం రూ. మూడులక్షలు చోరీ

ఇంట్లో దొంగతనం రూ. మూడులక్షలు చోరీ

ఇదే నిజం, కాశిబుగ్గ వరంగల్‌ : వరంగల్‌ నగరంలోని కాశిబుగ్గ వివేకానంద కాలనీలో ఆదివారం రాత్రి చోరీ జరిగిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడి అడికిచెర్ల శ్రీనివాస్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 7న తన కూతరు వివాహం జరిగింది. అయితే 10న ఆదివారం పెళ్లి కుమారుడి ఇంటికి వెళ్లారు. రాత్రి ఇంటికి తిరిగి రాకా ఇంటి వెనుక తలుపులు తెరుచుకొని ఉన్నాయి. దాంతో ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా బీరువా తలుపులు తెరిచి ఉన్నాయి. బీరువాలో ఉన్న రూ. మూడు లక్షలను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకొని వెళ్లినట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. జారుగంజ్‌ పోలీస్‌ స్టేషన్‌లో బాధితుడు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు. క్లూస్‌ టీం సిబ్బంది ఇంటికి వచ్చిన దొంగతనం జరిగిన తీరును పరిశీలించి ఆధారాలు సేకరించారు.

Recent

- Advertisment -spot_img