Homeక్రైంమెదక్ ఎల్లమ్మ ఆలయంలో చోరీ..

మెదక్ ఎల్లమ్మ ఆలయంలో చోరీ..

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో : దొంగలు రెచ్చిపోతున్నారు. ఇళ్లు, ఆలయాలు అనే తేడా లేకుండా పోతోంది. తాజాగా మెదక్ జిల్లా కొల్చారం మండలం ఎనగండ్లలోని ఎల్లమ్మ ఆలయంలో దుండగులు చోరికి పాల్పడ్డారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఆలయంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. హుండీలోని డబ్బులతో పాటు, ఇతర సామాగ్రిని కలిపి సుమారు 4 లక్షల రూపాయలకు వరకు ఎత్తుకెళ్లారు. విషం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఈ ఆలయంలో నెలరోజుల వ్యవధిలోనే మూడుసార్లు చోరీ జరిగిందని, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని గ్రామస్థులు ఆరోపించారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img