బండ్ల గణేష్.. తెలుగు ప్రజలకు పరిచయం చేయనక్కర్లేని పేరు. కులం పేరుతో బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే గతంలో తనకు కులం పిచ్చి లేదని.. కుల, మతాల గురించి పెద్దగా ఆసక్తి చూపనంటూ ట్విట్టర్ ద్వారా పోస్టులు పెట్టిన బండ్ల గణేష్ ఆదివారం తాను కమ్మవాడిగా పుట్టినందుకు గర్విస్తున్నానని.. ఆనందిస్తున్నానంటూ కామెంట్ చేశారు. మాదాపూర్ లో జరిగిన కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ మీటింగ్ కి అటెండ్ అయిన బండ్ల గణేష్ కమ్మ సామాజికవర్గానికి సంబంధించి పొగుడుతూ గొప్పగా చెప్పడం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ కామెంట్స్ పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
బండ్ల గణేష్ చెప్పినట్టు తన కులం వాడు ఏనాటి కైనా అమెరికా ప్రెసిడెంట్ అవుతాడో లేదో తెలియదు కానీ, తన వల్ల కమ్మ కులం పరువు మాత్రం పోతున్నదనేది వాస్తవం. గతంలో బ్లేడ్ ఇ ష్యూ పిచ్చివాగుడు, పోలీస్ కేసులు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. కేఏ పాల్ లాగా బండ్ల గణేష్ ను కూడా ప్రజలు జోకర్ లాగా చూస్తారు.