Homeహైదరాబాద్latest News30 పడకల ఆస్పత్రికి ముగ్గురే డాక్టర్లు

30 పడకల ఆస్పత్రికి ముగ్గురే డాక్టర్లు

ఇదే నిజం, గూడూరు: మేజర్ గిరిజన మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలోని 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో, ముగ్గురే డ్యూటీ డాక్టర్లు ఉండడంతో, ఇటు డాక్టర్లకు అటు పేషెంట్లకు, ప్రజలకు తీవ్ర ఇబ్బందులు గురవుతున్న నేపథ్యంలో. అనేకమార్లు సూపరింటెండెంట్ డాక్టర్ వీరన్న నాయక్ ను, ప్రభుత్వ దవాఖానలో డాక్టర్లు లేక నానా ఇబ్బందులు పడుతున్న పేషెంట్లు, ప్రజలు నిలదీయగా, పైఅధికారులకు అనేక సార్లు రెఫరండం ఇచ్చిన, 30 పడకల ఆసుపత్రికి కావలసిన డాక్టర్లను రిక్రూట్ మెంట్ పైఅధికారులు చేయక పోవడం వలన ఇరువురికి, ఈ ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. ఈ ఏజెన్సీ మండలంలోని ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు డాక్టర్లు లేక, మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి, లేదా! వరంగల్ లోని ఎంజీఎం ప్రభుత్వ ఆసుపత్రికి తరలి వెళ్లాల్సి వస్తుందని, దీనితో గిరిజన ప్రజలు నానావస్థలు పడుతున్నారు.

ప్రజలను ఒక ఓటు బ్యాంకుగా కాకుండా, తమ తోటి ప్రజానికంగా గుర్తించి పాలకవర్గం స్పందించాలని, గత అసెంబ్లీ ఎన్నికల్లో మార్పు కోరిన గూడూరు ప్రజలు. డాక్టర్ నే ఎమ్మెల్యే గా గెలిపించుకుంటే, ప్రజల ప్రాణాల విలువలు తెలిసినా వ్యక్తిగా, గిరిజన మండలంలో ఉన్న 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి కావలసిన డాక్టర్లను, సిబ్బందిని, సదుపాయాలను కల్పించి, గూడూరు ఆసుపత్రికి ఒక మహార్దశ తీసుకువస్తారనే ఉద్దేశంతోనే, పార్టీలకు అతీతంగా ప్రజలందరూ డాక్టర్ భూక్య మురళి నాయక్ ను, దాదాపు 7500 ఫైచిలుకు ఓట్ల ఆదిక్యతనిచ్చి, భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించడం జరిగిందని గుర్తించి. డాక్టర్ వృత్తి నుండి ఎమ్మెల్యేగా ఎంపికైన డాక్టర్ భూక్య మురళి నాయక్. ఆరోగ్యపరమైన అన్ని విషయాలు, ఆసుపత్రిలో ఉన్న లోటుపాట్లను గుర్తించి, అన్ని సౌకర్యాలను త్వరితగతిన సమకూరస్తారని, అదేవిధంగా గూడూరు మండల ప్రజలకు సంబంధించిన ఉమ్మడి ఆస్తి అయినటువంటి,సామాజిక ఆరోగ్య కేంద్రానికి సంబంధించిన స్థలం రియల్ ఎస్టేట్ గుత్తేదారులు అన్యక్రాంతం చేస్తున్న, దీనిపై అనేకమార్లు ఫిర్యాదు చేసిన, ఇటు గూడూరు మండల రెవెన్యూ తహసిల్దార్ సంగు శ్వేత గాని, అటు మహబూబాబాద్ ఆర్డిఓ గాని, జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ గాని స్పందించకపోవడం విచారకరం. దీనిపై కూడా ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్, పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్ లు స్పందించి, జిల్లా ఆరోగ్య ఉన్నతాధికారులకు, రెవెన్యూ ఉన్నతాధికారులకు, జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేసి, ప్రభుత్వ ఆసుపత్రి భూమి అన్యాక్రాంతం కాకుండా చూడాలని, గూడూరు మండల ప్రజలు, మేధావులు, రాజకీయ విశ్లేషకులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు కోరుకుంటున్నారు.

Recent

- Advertisment -spot_img