Homeహైదరాబాద్latest Newsకీరదోసతో ప్రయోజనాలెన్నో!

కీరదోసతో ప్రయోజనాలెన్నో!

వేసవి వచ్చేసింది. మండే ఎండల నుంచి ఉపశమనం , ఆరోగ్య పరిరక్షణ కోసం జాగ్రత్తలు తప్పనిసరి. చాలామంది ఈ కాలంలో కీరదోసను తినడానికి ఎక్కువమంది ఇష్టపడుతుంటారు. శరీరంలో వేడిన తగ్గిస్తూ ఉపశమనంగా ఉంటుంది. ఆరోగ్యపరంగానూ అనేక ప్రయోజనాలు చేకూరుస్తుంది కీరదోసకాయ.

కీరదోసకాయలో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ కె, ఫోలేట్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. దీన్ని తినడం వల్ల చాలా తక్కువ కాలంలో బరువు తగ్గవచ్చు. బరువు తగ్గాలనుకునేవారికి కీర దోసకాయను మించిన ఆహారం లేదు. కీరదోసను రోజులో రెండు మూడు సార్లు తినడం వల్ల త్వరగా బరువు తగ్గే అవకాశం ఉంది. దీన్ని తినడం వల్ల ఎక్కువ సేపు పొట్ట నిండిన ఫీలింగ్ వస్తుంది. ఇతర ఆహారాలు తినకుండా ఉంటారు.

బరువు తగ్గాలనుకునేవారికి కీర దోసకాయను మించిన ఆహారం లేదు. అర కప్పు తరిగిన దోసకాయ ముక్కల్లో 8 కేలరీలు మాత్రమే ఉంటాయి. ఇందులో 1.9 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 0.3 గ్రాముల ఫైబర్, 0.3 గ్రాముల ప్రోటీన్ ఉంటాయి. మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ సి, విటమిన్ కె, మాంగనీస్ అధికంగా ఉంటాయి. కీరదోసకాయ డైట్ ను తినడం వల్ల రెండు వారాల్లోనే ఏడు కిలోల బరువు తగ్గవచ్చు. అలాగే ప్రొటీన్ లోపం రాకుండా చికెన్, చేపలు, మాంసం, టోఫు, పప్పుధాన్యాలు వంటి ఆహారాలను తీసుకోవాలి. మూడు పూటలా భోజనం చేశాక… మధ్యలో ఆకలి వేస్తే కీరాదోస మాత్రమే తినాలి. ఇతర ఆహారాలు తినకూడదు.

కీరదోసకాయలో ఉండే అధిక ఫైబర్ మీ పొట్టను నిండుగా ఉంచుతుంది. అయితే గర్భంతో ఉన్నవారు, బాలింతలు మాత్రం ఈడైట్ ఫాలో అవ్వకుండా పొట్ట నిండా తినాల్సిన అవసరం ఉంది. వేసవిలో కీరదోసకాయ జ్యూస్ ను డైట్ లో చేర్చుకోండి. ఈ జ్యూస్ శరీరాన్ని డిటాక్స్ చేయడానికి పనికొస్తుంది. శరీరం నుంచి టాక్సిన్లను బయటికి పంపింస్తుంది. కీరాదోస గింజలు శరీరంలో పేరుకుపోయిన అదనపు నీటిని తొలగిస్తాయి. కీరదోసకాయలో ఇథనాల్ అనే మూలకం ఉంటుంది, ఇది శరీరంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. పొట్ట దగ్గర కొవ్వును తగ్గించడంలో ఇది ముందుంటుంది.

Recent

- Advertisment -spot_img