Homeహైదరాబాద్latest Newsవిద్య పేరిట వ్యాపారానికి అడ్డూఅదుపూ లేకపాయె.. ఫీజుల భారం మొదలాయె..!

విద్య పేరిట వ్యాపారానికి అడ్డూఅదుపూ లేకపాయె.. ఫీజుల భారం మొదలాయె..!

విద్య పేరిట కార్పొరేట్‌ సంస్థలు చేస్తున్న వ్యాపారానికి అడ్డూఅదుపూ లేకుండాపోయింది. ఫీజులు చెబితేనే విద్యార్థుల తల్లితండ్రుల ఫ్యూజులు ఎగిరిపోయే పరిస్థితి నెలకొంది. ఏటా జూన్‌లో ఇదే పరిస్థితి ఉన్నా.. ఇందుకోసం తల్లిదండ్రులు ఆదాయంలో 59శాతం ఖర్చు చేస్తున్నారు. ఏటా 10 శాతానికి పైగా ఫీజులు పెరుగుతున్నాయి. కార్పొరేట్‌ స్కూళ్లలో LKGకే రూ.25వేలు, 6వ తరగతి నుంచి ఏ సీటు కావాలన్నా కనీసం రూ.అర లక్ష ఖర్చు చేయాల్సి వస్తోంది. పాఠశాలలు, కళాశాలల్లో ఏటా పెరుగుతున్న ఫీజుల భారం ప్రజలను ఆర్థికంగా దెబ్బతీస్తోంది. ఏటా తల్లిదండ్రులు లక్షల రూపాయలు వెచ్చించి పిల్లలను చదివిస్తున్నారు. పిల్లల చదువుల కోసం అందుకోసం జీవితాల్ని ధారపోస్తున్నారు. ఫలితంగా తల్లిదండ్రులు ఆర్థికంగా చితికిపోతున్నారు.

Recent

- Advertisment -spot_img