Homeహైదరాబాద్latest Newsరాణా లో ఎస్సై లేడు.. పట్టణంలో నిఘా నేత్రాలు లేవు.. ప్రజల రక్షణ గాలికొదిలేసిన నిఘా...

రాణా లో ఎస్సై లేడు.. పట్టణంలో నిఘా నేత్రాలు లేవు.. ప్రజల రక్షణ గాలికొదిలేసిన నిఘా వ్యవస్థ..!

ఇదేనిజం, రాయికల్: రాష్ట్ర ప్రభుత్వం ఓ పక్క డ్రగ్స్ మాఫియాను అరికట్టేందుకు రోజురోజుకు వినూత్నమైన పద్ధతిలో రక్షణ వ్యవస్థను ముందుకు తీసుకెళు ౦టే, మరోపక్క ప్రజలకు అందుబాటులో రక్షణ అధికారులు, వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. జగిత్యాల జిల్లాలోని అతిపెద్ద మండలం గా పేరుగాంచిన రాయికల్ ఠాణా లో ఎస్సై లేక 15 రోజులు గడుస్తున్న పట్టించుకునే నాథుడే కరువయ్యారు. అలాగే రాయికల్ పట్టణంలో ఏర్పాటు చేసిన నిఘా నేత్రాలు పనిచేయక ఏళ్లు గడుస్తున్న పట్టించుకునే వారు లేరు. దీంతో రాయికల్ పట్టణంలో, మండలంలో నిఘా వ్యవస్థ నిద్రపో తున్నదనీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల జిల్లాలోనే అతి పెద్ద మండలం గా పేరుగాంచిన రాయికల్, మున్సిపల్ గా ఏర్పడి ఏళ్లు గడుస్తున్న నిఘా వ్యవస్థ ఏర్పాటు చేయడంలో విఫలమయ్యారని అభిప్రాయ వ్యక్తం అవుతున్నాయి. రాయికల్ పట్టణంతోపాటు, 32 గ్రామాలు కలయికతో రాయికల్ అతి పెద్ద మండలం గా పేరుగాంచింది. కానీ నిఘా వ్యవస్థ ఏర్పాటు చేయడంలో మాత్రం అటు అధికారులు, ఇటు పాలకులు విఫలమయ్యారు అనే అభి పాయం వ్యక్తం అవుతున్నాయి. దాదాపు 65 వేలకు పైగా జనాభా ఉండే రాయికల్ మండలం లో నిఘా వ్యవస్థ సక్రమంగా పనిచేయకపోవడం పట్ల ప్రజల నుండి అనేక విమర్శలు వినిపిస్తున్నాయి. రాయికల్ రాణా కు ఎస్పై లేడు..

రాయికల్ లో పనిచేస్తున్న ఎస్ఐ గత 15 రోజుల క్రితం ఇసుక వ్యాపారుల నుండి డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని నేపథ్యంలో ఏసీబీ అధికారుల దాడుల నుండి తప్పించుకపోవడంతో అప్పటినుండి రాయికల్ రాణా ఖాళీగా ఉన్నది. రాయికల్ పట్టణంతో పాటు మండలంలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగిన, కేసులు నమోదైన జగిత్యాల రూరల్ సిఐ వచ్చి పరిశీలించాల్సిన పరిస్థితి నెలకొన్నది. దీంతో మండల ప్రజలు రక్షణ, నిఘా వవస్థపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఆపదపడి పోలీస్ స్టేషన్ కు వస్తే న్యాయం చేసేవారు ఎవరని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే రాయికల్ రానాలో సిబ్బంది కొరత నెలకొని ఉండడంతో మండలంలోని గ్రామాల్లో రాత్రి వేళల్లో గస్తీ, పట ణంలో గస్తీ కొరవడింది. అంతేకాకుండా గ్రామా ల్లో యువకులు డ్రగ్స్ బారినపడి విచ్చలవిడిగా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. రాయికల్ పట్టణంలో లక్షల విలువ చేసే బంగారం ఆభరణాలు దొంగిలించబడి నెలలు గడుస్తున్నా ఇప్పటికి దొంగలను పట్టుకున్న దాఖలాలు లేవు. ఏళ్లుగా పనిచేయని నిఘా నేత్రాలు రాయికల్ పోలీస్ స్టేషన్ తో పాటు, పట్టణంలోని వివిధ కూడల్లో ఏర్పాటు చేసిన నిఘా నేత్రాలు ఏళ్లు గడుస్తున్న పనిచేయడం లేదు. పట్టించు కోవాల్సిన పాలకులు,సంబంధిత అధికారులు వీటిపై దృష్టి సారించకపోవడంతో నిఘా నేత్రాలు ఏల నుండి నిరుపయోగంగా పడి ఉన్నాయి.

దీంతో రాయికల్ పట్టణంలో గత కొన్ని నెలల నుండి వివిధ రకాల దొంగతనాలు, హత్యలు, పోకిరిల బెడద వంటి సమస్యలు తలెత్తుతున్నప్పటికీ వాటిని పరిష్కరించడంలో అధికారులు విఫలమయ్యారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తరచూ కళాశాల వద్ద పోకిరిల బెడద, అదేవిధంగా డ్రగ్స్ పట్ల యువత ఆకర్షితులు అవడం వంటి సమస్యలను పరిష్కరించడంలో నిఘా నేత్రాలు లేకపోవడంతో పోలీసు వ్యవస్థ కూడా ఏం చేయాలని పరిస్థితుల్లో ఉండిపోయారు. దీంతో ఓపక్క రాయికల్ నాలో లేకపోవడం, దానికి అనుగుణంగానే సిబ్బంది సైతం తక్కువ ఉండడంతో, అలాగే రాయికల్ పట్టణంతో పాటు గ్రామాల్లో నిఘానేత్రాలు పనిచేయకపోవడంతో మండల వ్యాప్తంగా నిఘా వ్యవస్థ నిద్రపోతున్నదని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత జిల్లా ఉన్నతాధికారులు, స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ లు స్పందించి రాయికల్ రానాకు నూతన ఎస్సైని వెంటనే నియమించాలని, అదేవిధంగా రాయికల్ పట్టణంతోపాటు, గ్రామాల్లో సైతం నిఘానేత్రాలు పనిచేసే విధంగా చర్యలు చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు, జగిత్యాల జిల్లాలోనే అతిపెద్ద మండలం గా పేరుగాంచిన రాయికల్ పోలీస్ స్టేషన్ కు నూతన ఎస్పై కేటాయించడంతో పాటు, పట్టణంలో నిఘా నేత్రాలు ఏర్పాటు చేశారు.

Recent

- Advertisment -spot_img