భారత్ లో అత్యంత ధనవంతులైన నటీమణుల జాబితాను ‘హురున్ ఇండియా రిచ్ లిస్ట్-2024’ వెల్లడించింది. ఈ జాబితా ప్రకారం.. జూహీ చావ్లా భారత్ లో అత్యంత ధనవంతులైన నటిగా (సంపద సుమారు రూ 4,600 కోట్లు) అగ్రస్థానంలో ఉంది. ఐశ్వర్య రాయ్ రెండో స్థానంలో (రూ. 850 కోట్లు) ఉన్నారు. ప్రియాంక చోప్రా (రూ. 650 కోట్లు), అలియా భట్ (రూ.550 కోట్లు) వరుసగా 3, 4 స్థానాల్లో నిలిచారు. ఈ జాబితాలో దీపికా పదుకొనే (రూ.500 కోట్లు) 5వ స్థానంలో ఉన్నారు.