జింబాబ్వే పర్యటనకు టీమిండియా బయలుదేరింది. శుభ్‌మన్ గిల్ నేతృత్వంలో జట్టు ఈనెల 6 నుంచి ఐదు టీ20ల్లో తలపడనుంది. తొలి రెండు మ్యాచులకోసం ముగ్గురు ప్లేయర్లను బీసీసీఐ మార్చింది. సంజుశాంసన్, శివమ్‌దూబె, యశస్విజైస్వాల్ స్థానంలో సాయి సుదర్శన్, జితేశ్ శర్మ, హర్షిత్ రాణాను తీసుకున్నారు. తుపాను కారణంగా భారత ప్రపంచకప్ జట్టు బార్బడోస్‌లో చిక్కుకుంది. అందులో శాంసన్, దూబె, యశస్వి ఉన్నారు.