కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూసే వారికి శుభవార్త. ఎందుకని అనుకుంటున్నారా.. అయితే మీరు ఈ కొత్త అప్డేట్ గురించి తెలుసుకోవాల్సిందే. కొత్త రేషన్ కార్డులో జారీ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల (అక్టోబర్) లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు సమాచారం. అయితే కొత్త రేషన్ కార్డుల అర్హతపై సస్పెన్స్ కొనసాగుతోంది. కార్డుల జారీకి లబ్ధిదారుల ఆదాయ పరిమితి, అర్హతలపై నిబంధనలను పున:సమీక్షిస్తామని చెప్పడంతో ప్రజల్లో సందేహాలు నెలకొన్నాయి. కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులకు వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షల్లోపు, పట్టణాల్లో రూ.2లక్షల్లోపు ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అలాగే 3.5 ఎకరాలలోపు తడి, 7.5 ఎకరాలలోపు మెట్ట భూమి ఉన్నవారికి మాత్రమే ఇవ్వనున్నట్లు తెలిసింది.