Homeక్రైంచైన్ స్నాచింగ్ జంట.. లవర్స్ కాదు.. భార్యాభర్తలు

చైన్ స్నాచింగ్ జంట.. లవర్స్ కాదు.. భార్యాభర్తలు

ఇదే నిజం, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో చైన్​స్నాచింగ్​కు పాల్పడింది లవర్స్​ కాదని, వారు భార్యాభర్తలని పోలీసులు నిర్ధారించారు. మర్రిగూడెంలో సునీత అనే మహిళకు లిఫ్ట్‌ ఇచ్చి మరీ ఏడు తులాల మంగళసూత్రాన్ని లాక్కుని పారిపోయిన ఈ జంట కోసం పోలీసులు నాలుగు బృందాలు ఏర్పడి, గాలింపు చర్యలు చేట్టారు. సాంకేతికత ఆధారంగా వారిని ట్రేస్​ చేశారు. హైదరాబాద్ లోని సంతోష్ నగర్ కు చెందిన వెంకటేశ్​, అతని భార్యను అదుపులోకి తీసుకున్నారు. తాము లవర్స్​ కాదని, భార్యాభర్తలని విచారణలో తెలిపారు. వ్యసనాలకు అలవాటు అయి వీరిద్దరూ చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్నట్లు పోలీసులు వివరించారు. దొంగిలించిన బంగారాన్ని తాకట్టు పెట్టి నగదు రూపంలో మార్చుకున్నట్లు పేర్కొన్నారు. చోరీ ఘటనపై కేసు నమోదు చేశామని, వీరు ఇంకా ఎక్కడైనా దొంగతనాలకు పాల్పడ్డారా? అనే దానిపై ఆరా తీస్తున్నట్లు చెప్పారు.
ఎలా ట్రేస్ చేశారంటే.?
యువజంట మహిళ మెడలో గొలుసు తీసుకుని మెరుపు వేగంతో బైక్ పై పరారైన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు.. బైక్ నెంబర్ సాయంతో ఫోన్ నెంబర్ తెలుసుకుని సిగ్నల్ ఆధారంగా చాకచక్యంగా వారిని ట్రేస్ చేశారు.

Recent

- Advertisment -spot_img