Homeహైదరాబాద్latest Newsలైంగికంగా వేధిస్తూ.. ఫొటోలు తీసి బెదిరింపులు

లైంగికంగా వేధిస్తూ.. ఫొటోలు తీసి బెదిరింపులు

– శానిటేషన్​ కార్మికురాలిని వేధిస్తున్న కుతుల్లాపూర్ ఫీల్డ్ అసిస్టెంట్
– ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: శానిటేషన్ కార్మికురాలిని ఫీల్డ్ అసిస్టెంట్ లైంగికంగా వేధిస్తున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి కథనం ప్రకారం.. కుత్బుల్లాపూర్ పరిధిలోని గాజులరామరం జీహెచ్ఎంసీ సర్కిల్ శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్ కిషన్.. శానిటేషన్ కార్మికురాలిపై కన్నేశాడు. ఆమెను లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నాడు. తన మాట వినకుంటే ఉద్యోగం నుంచి తొలగిస్తామంటూ బెదిరించేవాడు. లైంగిక వేధింపులకు పాల్పడుతూ.. వాటిని వీడియోలు, ఫోటోలు తీసేవాడు. కిషన్ తీసిన వీడియోలు బయటికి రావడంతో ఈ దారుణం వెలుగులో చూసింది. అతడిపై చర్యలు తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. అయితే కిషన్‌పై ఉన్నతాధికారులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది.

Recent

- Advertisment -spot_img